Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగం కోసం ‘నారాయణ’ వద్దకు వెళ్లా...ఆయనపైనే గెలిచి మంత్రినయ్యా: ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

  • రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదు
  • అనుకోని ఘటనలు నా జీవితాన్ని మలుపుతిప్పాయి
  • వైద్యుడిని అయినా వృత్తి కొనసాగించాలని అనుకోలేదు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు తెలిపారు. వృత్తిరీత్యా వైద్యుడినైన తాను రాజకీయాల్లోకి వస్తానని ఏ రోజూ అనుకోలేదని, కానీ అనుకోని ఘటనలు ఎదురు కావడంతో తన జీవితంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఓ టీవీ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ ఒకప్పుడు నారాయణ కళాశాలలో ఉద్యోగం కోసం వెళ్లానని, అదే కళాశాల యజమాని నారాయణపై గెలిచి మంత్రిని కావడం యాధృచ్చికమని అన్నారు.

‘డాక్టర్‌ కోర్సు చదివాను. కానీ ఎప్పుడూ ప్రాక్టీస్‌ చేయలేదు. మా నాన్నగారు చనిపోవడంతో డెంటిస్ట్‌గా వెళ్లేందుకు మనసు అంగీకరించలేదు. దీంతో ఎప్పుడూ ఓ కూల్‌ డ్రింక్‌ షాపులో కూర్చుని కాలక్షేపం చేసేవాడిని’ అని మంత్రి తెలిపారు. నా పరిస్థితిని చూసిన మా అమ్మ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నారని అడిగితే ‘డాక్టర్‌ చదివాడు, ఖాళీగా తిరుగుతున్నాడు’ అని  చెప్పేదన్నారు.

దీంతో నారాయణ కళాశాలలో ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పారు. అయితే వారు మూడు నెలలు ఆగి వస్తే చెబుతామనడంతో అక్కడ చేరే అవకాశం రాలేదన్నారు. ఈలోగా తమ  బాబాయి చనిపోవడంతో, అనుకోకుండా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు. అదే నారాయణపై పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఒకవేళ నారాయణ ఉద్యోగం ఇచ్చివుంటే తన పరిస్థితి వేరుగా ఉండేదేమోనని అన్నారు.
Nellore
narayana
anilkumar yadav

More Telugu News